: స్పీకర్ ను సీఎం చేద్దాం...!: దినకరన్ వర్గ ఎమ్మెల్యేల కొత్త డిమాండ్
అన్నాడీఎంకే చీలికవర్గ నేత దినకరన్ మరోసారి క్యాంపు రాజకీయాలకు తెరతీయడంతో... ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు ఇబ్బందుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో, దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ముఖ్యమంత్రి పదవి నుంచి పళనిస్వామిని తొలగించి, ఆయన స్థానంలో స్పీకర్ దనపాల్ ను సీఎంగా చేయాలని వారు డిమాండ్ చేశారు. బలపరీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని తాము చెప్పలేదని... అయితే పళనిస్వామి స్థానంలోకి దనపాల్ ను తీసుకురాలని మాత్రమే తాము కోరుతున్నామని ఎమ్మెల్యే వెట్రివేల్ తెలిపారు.