: రేపు కోర్టుకు హాజరవుతా: గుర్మీత్ రామ్ రహీం సింగ్ బాబా
ఇద్దరు సాధ్విలపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై సీబీఐ కోర్టులో కేసును ఎదుర్కుంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ ఈ రోజు హిందీలో ఒక ట్వీట్ చేశారు. తాను వెన్నునొప్పితో బాధపడుతున్నప్పటికీ రేపు హర్యానాలోని పంచకులా సీబీఐ కోర్టుకు హాజరవుతానని స్పష్టం చేశారు. ఈ కేసులో రేపు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల ప్రభుత్వాలు భారీగా పోలీసులను మోహరింపజేసి చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే ఈ రోజు, రేపు విద్యాలయాలకు సెలవు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి.