: సూర్యగ్రహణం రోజు పుట్టిందని `ఎక్లిప్స్` అని పేరు పెట్టారు!
మొన్న వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడిన కొన్ని గంటలకు జన్మించడంతో తమ కూతురికి `ఎక్లిప్స్` అని నామకరణం చేశారు ఓ అమెరికన్ తల్లిదండ్రులు. దక్షిణ కరోలినాలోని గ్రీన్‌విల్లే ప్రాంతానికి చెందిన ఫ్రీడం యూబ్యాంక్స్, మైకేల్ యూబ్యాంక్స్‌లకు ఆగస్టు 21, ఉదయం 8 గం.లకు ఆడపిల్ల జన్మించింది. నిజానికి డాక్టర్లు ఇచ్చిన తేదీ ప్రకారం ఫ్రీడం సెప్టెంబర్ 3న డెలివరీ కావాల్సి ఉంది. కానీ ఆగస్టు 21నే ఆమెకు పురిటినొప్పులు రావడంతో మైకేల్ గ్రీన్‌విల్లే మెమోరియల్ ఆసుపత్రికి తీసుకువచ్చాడు.
డాక్టర్లు ఆమెకు ప్రసవం చేయడంతో ఫ్రీడం ఆడపిల్లకు జన్మనిచ్చింది. మొదట వారికి పుట్టబోయే పాపకు `వయలెట్` అని పేరు పెట్టుకుందామనుకున్నారు. కానీ సూర్యగ్రహణం రోజు అనుకోకుండా పాప జన్మించడంతో `ఎక్లిప్స్` అని పేరు పెట్టామని, తనని ముద్దుగా `క్లిప్సీ` అని పిలుచుకుంటామని యూబ్యాంక్స్ దంపతులు తెలిపారు.