: ‘వీడెవడో లక్కీకి కజిన్ లా ఉన్నాడు’.. శర్వానంద్ కొత్త సినిమా టీజర్ పై ప్రభాస్, నాని ఆసక్తి


శ‌ర్వానంద్ హీరోగా విభిన్న క‌థ‌తో మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం మ‌హానుభావుడు టీజ‌ర్ ఈ రోజు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఇందులో చేసిన పనినే మ‌ళ్లీ మ‌ళ్లీ చేస్తూ, అతి శుభ్ర‌త పాటించే ఓసీడీ అనే మాన‌సిక వ్యాధి ఉన్న పాత్ర‌లో శ‌ర్వానంద్ క‌నిపించాడు. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న ఈ టీజ‌ర్ గురించి యంగ్ హీరోలు ప్ర‌భాస్‌, నాని స్పందించారు. ఈ టీజ‌ర్ ఎంతో స‌ర‌దాగా, ఆస‌క్తిక‌రంగా ఉంద‌ని ప్ర‌భాస్ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నాడు. వీడెవ‌డో ల‌క్కీకి (భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాలో నాని పోషించిన విభిన్న‌ పాత్ర పేరు) క‌జిన్ బ్ర‌ద‌ర్‌లా ఉన్నాడు అని నాని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నాడు. ఈ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్న‌ట్లు ప్ర‌భాస్, నాని తెలిపారు.

  • Loading...

More Telugu News