: రైల్వేమంత్రిగా సురేశ్ ప్ర‌భు మూడేళ్ల హయాంలో 207 రైలు ప్రమాదాలు!


గ‌డిచిన ప‌దేళ్ల‌లో రైల్వేమంత్రిగా సురేశ్ ప్ర‌భు హయాంలోనే ఎక్కువ మంది ప్ర‌యాణికులు మ‌ర‌ణించిన‌ట్లు తేలింది. 2014 న‌వంబ‌ర్‌లో రైల్వేమంత్రిగా సురేశ్ ప్ర‌భు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 2016-17లో ద‌శాబ్దంలోనే అత్య‌ధికంగా 193 మంది ప్ర‌యాణికులు రైలు ప్ర‌మాదాల వ‌ల్ల మ‌ర‌ణించారు. ఈ మ‌ధ్య జ‌రిగిన ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ ప్ర‌మాద మృతుల‌తో క‌లిపి మొత్తం 249 మంది ప్ర‌యాణికులు సురేశ్ ప్ర‌భు హ‌యాంలో ప్రాణాలు కోల్పోయారు.

యూపీఏ చివ‌రి మూడేళ్ల పాల‌న‌లో 157 ప్ర‌మాదాల్లో 84 మంది మ‌ర‌ణించారు. వీరిలో 2011-12లోనే 73 మంది మృత్యువాత ప‌డ్డారు. అలాగే గ‌డ‌చిన మూడేళ్ల‌లో జ‌రిగిన 207 ప్ర‌మాదాల్లో దాదాపు 1,135 మంది మ‌ర‌ణించిన‌వారు, గాయ‌ప‌డిన‌వారు ఉన్నారు. ఇదిలా ఉండ‌గా త‌మ హయాంలో రైల్వే భ‌ద్ర‌త పెరిగిన‌ట్లు, అందుకు యూపీఏ వారి కంటే ఎక్కువ డ‌బ్బు ఖ‌ర్చుపెట్టిన‌ట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికి మ‌ద్ద‌తుగా అధికారిక నివేదిక కూడా విడుద‌ల చేసింది. కానీ అందులో రైలు ప్ర‌మాదాలు, వాటి వ‌ల్ల మ‌రణించిన వారి సంఖ్య‌ను పేర్కొన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

  • Loading...

More Telugu News