: ఉప్పు కావాలా?... అయితే ఒక రూపాయి ఎగస్ట్రా చెల్లించండి... హైద్రాబాద్‌లో ఓ రెస్టారెంట్‌ నిర్వాకం


హైద్రాబాద్ సోమాజీగూడ రాజ్‌భ‌వ‌న్ రోడ్‌లోని హెడ్‌క్వార్ట‌ర్ రెస్టారెంట్‌లో చిటికెడు ఉప్పుపై ఒక రూపాయి బిల్లు వేస్తున్నారు. కుటుంబంతో క‌లిసి ఆ హోట‌ల్‌కి వెళ్లిన ఓ వ్య‌క్తి తాను ఆర్డ‌ర్ చేసిన నిమ్మ‌కాయ సోడాలోకి కొద్దిగా ఉప్పు కావాల‌ని సిబ్బందిని అడిగాడు. త‌ర్వాత త‌న‌కు వేసిన బిల్లులో అద‌న‌పు ఉప్పు అడిగినందుకు ఒక రూపాయి బిల్లు వేయ‌డం చూసి కంగుతిన్నాడు. దీనిపై ఆ వ్య‌క్తి లీగ‌ల్ మీట‌రాల‌జీ డిపార్టుమెంటుకు ఫిర్యాదు చేశారు.

కానీ ఉప్పు ప్యాకెట్‌తో కాకుండా విడిగా ఇచ్చిన కార‌ణంగా వారు రెస్టారెంట్‌పై చ‌ర్య తీసుకోలేక‌పోయారు. ప్యాకేజ్డ్ గూడ్స్ అండ్ క‌మోడిటీస్ చ‌ట్టం ప్ర‌కారం కేవ‌లం ప్యాక్ చేసిన వ‌స్తువుల‌పైనే చ‌ర్య‌లు తీసుకునే అధికారం లీగ‌ల్ మీట‌రాల‌జీ డిపార్టుమెంట్‌కి ఉంటుంది. ఇదిలా ఉండ‌గా రెస్టారెంట్ కొత్త‌గా పెట్టినందువ‌ల్ల‌ బిల్లింగ్ మెషీన్‌లో సాంకేతిక లోపాల కార‌ణంగా ఈ స‌మ‌స్య వ‌చ్చుంటుంద‌ని రెస్టారెంట్ యాజ‌మాన్యం తెలిపింది. వినియోగ‌దారునికి క‌లిగిన అసౌక‌ర్యం కార‌ణంగా తాను తీసుకున్న నిమ్మ‌సోడా ధ‌ర‌ను తిరిగి చెల్లిస్తామ‌ని యాజ‌మాన్యం చెప్పింది. కానీ ఇందుకు ఆ వ్య‌క్తి అంగీక‌రించ‌లేదు.

  • Loading...

More Telugu News