: క‌న్యాకుమారిలో ప‌డ‌వ షికారు ర‌ద్దు... కార‌ణం తుపాను!


తుపాను కార‌ణంగా క‌న్యాకుమారి స‌ముద్ర‌తీరంలో క‌ల్లోల ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీంతో స‌ముద్రంలో నిర్మించిన వివేకానంద స్మార‌క రాక్‌, తిరువ‌ళ్లువార్ భారీ విగ్ర‌హాల‌ను చూసేందుకు ప‌ర్యాట‌కులను అనుమతించ‌డం లేదు. ఆయా ప్ర‌దేశాల‌కు తీసుకెళ్లే పడ‌వ ప్ర‌యాణాల‌ను కూడా ర‌ద్దు చేయ‌డంతో సంద‌ర్శ‌కులు తీవ్ర అసంతృప్తికి లోన‌వుతున్నారు. క‌న్యాకుమారి ప్రాంతానికి వివిధ దేశాల నుంచి ప‌ర్యాట‌కులు విచ్చేస్తుంటారు. గ‌త ఐదు రోజులుగా స‌ముద్రం క‌ల్లోలంగా మార‌డంతో ప‌డ‌వ ప్ర‌యాణాల‌ను అధికారులు ర‌ద్దు చేశారు. దీంతో చేసేది లేక వ‌చ్చిన సంద‌ర్శ‌కులు నిరాశ‌తో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.

  • Loading...

More Telugu News