: జమ్మూ కశ్మీర్ లో భూంకంపం.. రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదు!
జమ్మూకశ్మీర్ లో భూకంపం సంభవించింది. నిన్న అర్ధరాత్రి 2:28 గంటలకు జమ్మూకశ్మీర్ లో భూకంపం సంభవించిందని, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదైందని సమాచారం. అయితే ఈ భూకంపం ధాటికి జరిగిన నష్టంపై ఇంకా అంచనాలు అందలేదు. భూకంప కేంద్రం, నష్టం వివరాలు వంటి వాటిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.