: ఏపీ, తెలంగాణకు వేర్వేరు గవర్నర్ల నియామకంపై కేంద్రం కసరత్తు.. చక్కర్లు కొడుతున్న మోత్కుపల్లి పేరు!


కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు నడుం బిగించిన కేంద్రం అదే సమయంలో పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించాలని యోచిస్తోంది. ప్రస్తుతం బీహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాదార్ అండ్ నాగర్ హవేలీకి గవర్నర్లు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలకు పూర్తిస్థాయి గవర్నర్లను నియమించేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది.

ప్రస్తుతం కేంద్రమంత్రులుగా ఉన్న కొందరిని ఆయా రాష్ట్రాలకు గవర్నర్లుగా పంపాలని యోచిస్తోంది. కల్‌రాజ్ మిశ్రా, లాల్జీ టాండన్, విజయ్‌కుమార్ మల్హోత్రా, కైలాస్ జోషీ, ఆనందీ‌బెన్ పటేల్, మోత్కుపల్లి నర్సింహులు, సీపీ ఠాకూర్, జితిన్ రామ్ మాంఝీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక తెలంగాణ టీడీపీ సీనియర్ నేత అయిన మోత్కుపల్లికి ఈసారి గవర్నర్ గిరీ ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఏపీ, తెలంగాణకు కాకుండా మరో రాష్ట్రానికి ఆయనను పంపించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News