: నీ పిల్లలకు ‘ఫేస్ బుక్’, ‘ట్విట్టర్’,‘ఇన్ స్టాగ్రామ్’ అని పేర్లు పెట్టు: బాలీవుడ్ నటిపై సిద్ధార్థ్ మల్హోత్రా సరదా వ్యాఖ్యలు
బాలీవుడ్ నటీనటులు సిద్దార్థ్ మల్హోత్రా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎ జెంటిల్ మెన్’. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధార్థ్ మల్హోత్రా మాట్లాడుతూ, జాక్వెలిన్ ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో బిజీగా ఉంటుందని, రేపు ఆమెకు పిల్లలు పుడితే వారికి ‘ఫేస్ బుక్’, ‘ట్విట్టర్’, ‘ఇన్ స్టాగ్రామ్’ అని పేర్లు పెట్టాలంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు. సామాజిక మాధ్యమానికి ప్రచారకర్తగా అయిపోయిందని, ఆ మాధ్యమానికి ఆమెను కొంతకాలంగా దూరంగా ఉంచితే, చనిపోతుందేమో! అంటూ వ్యాఖ్యానించాడు.