: నంద్యాల మాదే, కాకినాడా మాదే: టీడీపీ నేత కళా వెంకట్రావు


ఈ రోజు జరిగిన నంద్యాల ఉపఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘జగన్ భాష నచ్చని ప్రజలు టీడీపీకే ఓటు వేశారు. టీడీపీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నంద్యాల మాదే, కాకినాడా మాదే’ అన్ని అన్నారు.

 కాగా, కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ తరపున మంత్రులు, సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ నేతలు కూడా అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమ విజయం తథ్యమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News