: రేపటి వన్డే కోసం నెట్స్‌లో చెమట చిందిస్తున్న టీమిండియా ఆటగాళ్లను చూడండి!
శ్రీలంకలో పర్యటిస్తోన్న టీమిండియా రేపు పల్లెకెలెలో రెండో వన్డే ఆడనుంది. తొలి వన్డేలో టీమిండియా శ్రీలంకపై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రేపు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నెట్ ప్రాక్టీసులో టీమిండియా బిజీబిజీగా ఉంది. వారు నెట్‌లో ప్రాక్టీస్ చేస్తోన్న ఫొటోలు, వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
తొలి మ్యాచ్‌లో చోటు దక్కని మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండేకు రేపటి జట్టులో స్థానం దక్కవచ్చు. మనీశ్ పాండే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇటీవలే మీడియాతో మాట్లాడిన కోహ్లీ 2019 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లని ఆడించి ప్రయోగాలు చేస్తామని చెప్పాడు.