: మా నాన్నగారికి నంద్యాల నియోజకవర్గం ఘన నివాళి అర్పించబోతోంది : భూమా మౌనిక
నంద్యాల ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేశారని, తన తండ్రి భూమా నాగిరెడ్డి ఆత్మ శాంతించాలని ప్రతి ఒక్కరూ కష్టపడ్డారని మంత్రి అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ‘మా నాన్నగారికి నంద్యాల నియోజకవర్గం ఘన నివాళి అర్పించబోతోంది. ఆయన ఆత్మ శాంతించబోతోంది. దీని కోసమే, మేమందరం వేచి చూస్తున్నాం. అలాగే, రాబోయే కాలంలో బ్రహ్మానందరెడ్డి అన్న కూడా ఎంతో మంచి పనులు చేస్తూ, నాన్న పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.