: రూ.2 వేల నోటును రద్దు చేసే ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదు: అరుణ్ జైట్లీ
పాత పెద్దనోట్ల రద్దు అనంతరం తీసుకొచ్చిన రూ.2 వేల నోటును రద్దు చేస్తారంటూ వస్తోన్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. ఆ ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని తెలిపారు. కొత్తగా తీసుకురానున్న రూ.200 నోటు గురించి స్పందించిన ఆయన... ఆ నోటును ఎప్పటి నుంచి చలామణిలోకి తీసుకురావాలన్న విషయాన్ని గురించి ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆర్‌బీఐకి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని, ఆ నోట్లను ఎప్పటి నుంచి ప్రింట్ చేయాలనే విషయం కూడా ఆర్‌బీఐ నిర్ణయించుకుంటుందని తెలిపారు.