: పెళ్లి పనులు ప్రారంభించాం.. నాగచైతన్య- సమంత బిజీబిజీ: అక్కినేని అమల


సినీ ప్రేమజంట అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహం అక్టోబర్ 6న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి పనులు ప్రారంభించామని అక్కినేని అమల తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను ఈ విషయమై మీడియా ప్రశ్నించగా, షాపింగ్, పెళ్లి ఏర్పాట్లకు సంబంధించి వాళ్లిద్దరూ చాలా బిజీగా ఉన్నారని చెప్పారు. నాగచైతన్య, సమంత జంట చూడముచ్చటగా ఉంటుందని, వీళ్లిద్దరూ సినిమా నటులే కావడం వల్ల వీరి పెళ్లి వార్తలపై ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతున్నారని అన్నారు. వారి పెళ్లి నిరాడంబరంగా తమ రెండు కుటుంబాల మధ్య జరపాలని నిశ్చయించామని అన్నారు.

  • Loading...

More Telugu News