: సీఎంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు


రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులందరితో చర్చించిన మీదటే విధాన నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి సి. రామచంద్రయ్య హితవు పలికారు. రాష్ట్రమేమీ గవర్నర్ పాలనలో లేదని, క్యాబినెట్ పాలనలో ఉందని మంత్రి గుర్తు చేశారు. సీఎం చేసేది సొంత వ్యాపారం కాదని, క్యాబినెట్ లో చర్చించాకే నిర్ణయాలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. పథకాలు మంచివే అయినా, వాటి అమలుపై విమర్శలు ఎందుకు వస్తున్నాయో సీఎం ఇకనైనా గుర్తించాలని రామచంద్రయ్య సూచించారు. అంతేగాకుండా, కేంద్ర మంత్రి చిరంజీవి సేవలను పార్టీ సరిగా వినియోగించుకోవడంలేదంటూ రామచంద్రయ్య వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News