: మా కుటుంబంపై నమ్మకం పెట్టుకున్న వారందరికీ ధన్యవాదాలు: భూమా బ్రహ్మానందరెడ్డి
ఉప ఎన్నికల నేపథ్యంలో తమ కుటుంబానికి అండగా ఉన్న టీడీపీ కార్యకర్తలకు, భూమా నాగిరెడ్డి అభిమానులకు, ప్రతి ఒక్కరికి తన ధన్యవాదాలు తెలుపుతున్నానని భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన మీడియతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, టీడీపీకి చెందిన ఇతర మంత్రులు తమకు అండగా నిలిచిన విషయాన్ని, చూపించిన ప్రేమను ఎప్పటికీ మరవలేమని అన్నారు. వాళ్లందరి ప్రోత్సాహంతోనే తాను ఈ రోజు పోటీ చేయలగలిగానని, అలాగే, తన బాబాయి మీద ఎంత ప్రేమ చూపించారో ,అంతే ప్రేమను తనపై చూపించిన ప్రజలందరికీ తన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.