: మా ప్రభుత్వాన్ని ఎవ్వరూ కూల్చలేరు: పన్నీర్ సెల్వం


ప్రభుత్వాన్ని కూల్చుతానంటూ వ్యాఖ్యానిస్తూ టీటీవీ దినకరన్ చేస్తోన్న ప్రయత్నాలపై తమిళనాడు ఉప ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం మండిప‌డ్డారు. ఈ రోజు అరియలూర్‌లో జరిగిన ఎంజీఆర్ జయంత్యుత్సవాలలో పాల్గొన్న‌ పన్నీర్ సెల్వం మాట్లాడుతూ... త‌మ ప్ర‌భుత్వాన్ని ఎవ్వ‌రూ కూల్చ‌లేర‌ని తెలిపారు. చేతనైతే దినకరన్ కూల్చుకోవాలని సవాల్ విసిరారు. దిన‌క‌ర‌న్ క్యాంపు రాజ‌కీయాలు చేస్తున్నాడ‌ని అన్నారు.  ఈ కార్యక్రమంలో పన్నీర్‌ సెల్వంతో పాటు ముఖ్యమంత్రి పళని స్వామి పాల్గొన్నారు.  

  • Loading...

More Telugu News