: నంద్యాలలో ముగిసిన పోలింగ్.. భారీగా పోలింగ్ నమోదు
నంద్యాల ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. నంద్యాల గ్రామీణం, గోస్పాడు మండలాల్లో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. పలుచోట్ల ఘర్షణలు చెలరేగాయి. నంద్యాల అర్బన్‌లో 70 శాతం వరకు పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూలేని రీతిలో భారీగా పోలింగ్ నమోదైంది. దాదాపు 80 శాతం కంటే ఎక్కువగానే పోలింగ్ నమోదయినట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలలోపు క్యూలో ఉన్నవారికి ఓటువేసే ఛాన్స్ ఉంది. అనంతరం అధికారులు పోలింగ్ ఎంత శాతం జరిగిందనే విషయంపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఈ నెల 28న ఈ ఎన్నిక ఫలితాన్ని ప్రకటించనున్నారు.