: నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత.. రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు
నంద్యాలలో ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ ఆ నియోజకవర్గంలోని ఏడవవార్డులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడి ఎన్టీఆర్ షాదీఖానా వద్ద శిల్పా, భూమా వర్గాల మధ్య గొడవ చెలరేగి, ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆ ప్రదేశానికి భారీగా పోలీసులు చేరుకుంటున్నారు. కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఘటనాస్థలికి రాయలసీమ రేంజ్ ఐజీ ఇక్బాల్ కూడా వచ్చారు. ఇరు వర్గీయులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.