: కేసులో మంత్రి గంటా శ్రీనివాసరావుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అనకాపల్లి రెండో అదనపు సివిల్ కోర్టు నుంచి ఈ రోజు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. గంటా శ్రీనివాసరావు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ కేసులో విచారణ చేపడుతున్న కోర్టు ఈ రోజు ఈ ఆదేశాలను జారీ చేసింది. కాగా, ఈ కేసులో తదుపరి విచారణను వచ్చేనెల 11కు వాయిదా వేసింది.