: నాసాకు వెళ్లిన సినీ నటుడు మాధవన్... వ్యోమగామి శిక్షణ కోసమా?
ప్రముఖ సినీ నటుడు మాధవన్ అమెరికా అంతరిక్ష కేంద్రం నాసాలో వ్యోమగాములు ధరించే సూట్ల గురించి నాసా శాస్త్రవేత్త వివరిస్తుండగా, నిశితంగా వింటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ తదుపరి చిత్రం `చందమామ దూర్ కే`లో మాధవన్ కీలక పాత్ర పోషించనున్నారు. అందులో మాధవన్ కూడా వ్యోమగామిగా కనిపించనున్నట్లు సమాచారం. అందుకే శిక్షణ కోసం నాసాకు వెళ్లారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాగా, ఈ ఫొటోను మొదటగా బాలీవుడ్ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇప్పటికే సుషాంత్ కూడా వ్యోమగామి శిక్షణ కోసం నాసా వెళ్లిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ అక్కడ నిజజీవితంలో వ్యోమగాములు నేర్చుకునే అన్ని అంశాలను అధ్యయనం చేయనున్నట్లు సుషాంత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.