: నంద్యాలలోని పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత.. పలువురు వైసీపీ నేతలకు గాయాలు
నంద్యాలలోని గాంధీనగర్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న ఘటనలో వైసీపీ నేత రాజగోపాల్ పై టీడీపీ నేత రాంబాబు అనుచరులు దాడికి యత్నించారు. టీడీసీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ వైసీపీ నేతల ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. పలువురు వైసీపీ నేతలకు గాయాలైనట్టు సమాచారం. కాగా, నంద్యాల ఉపఎన్నికల్లో పురుషుల కంటే ఎక్కువగా మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.