: నంద్యాలలో భారీగా పోలింగ్.. 3 గంటల వరకు 72 శాతం పోలింగ్!
నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లలో చైతన్యం వెల్లివిరుస్తోంది. భారీ ఎత్తున పోలింగ్ నమోదవుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకంగా 72 శాతం పోలింగ్ నమోదయింది. నంద్యాల రూరల్ లో 81 శాతం, నంద్యాల అర్బన్ లో 67 శాతం గోస్పాడు మండలంలో 81 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 1,57,401 ఓట్లు పోలవగా... ఇందులో 81,492 మంది మహిళలు, 75,910 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.