: హైదరాబాద్ లో యువత నుంచి రూ.లక్షలు వసూలు చేసి... ఉడాయించిన జాబ్ కన్సల్టెన్సీ
ఉద్యోగాల పేరుతో యువత నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఓ సంస్థ బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, నగరంలోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలో కొందరు వ్యక్తులు సూర్య కన‍్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. తాజాగా కెనడాలో ఉద్యోగాలు ఉన్నాయంటూ, అందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చని నిరుద్యోగులను నమ్మించారు. అందుకు ఫీజుగా కన్సల్టెన్సీ నిర్వాహకులు ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష చొప్పున తీసుకున్నారు. చివరకు ఆ డబ్బుతో ఉడాయించారు. సూర్య కన్సల్టెన్సీలో ఉద్యోగాల కోసం దాదాపు 100 మంది డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది.