: `రేస్ 3` చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన జాక్వెలీన్ ఫెర్నాండెజ్
`కిక్` చిత్రం తర్వాత సల్మాన్ ఖాన్ సరసన `రేస్ 3` చిత్రంలో నటించనున్నట్లు బాలీవుడ్ నటి జాక్వెలీన్ ఫెర్నాండెజ్ తెలిపింది. ఇప్పటికే వచ్చిన సంచలన విజయం నమోదు చేసుకున్న `రేస్`, `రేస్ 2` చిత్రాలకు కొనసాగింపుగా `రేస్ 3` రాబోతుంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్‌కు బదులుగా సల్మాన్ నటించనున్నారు. మరో విషయం ఏంటంటే... గత రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన అబ్బాస్ - మస్తాన్ ద్వయం ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. `రేస్ 3` దర్శకత్వ బాధ్యతలను కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రెమో డిసౌజా చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సల్మాన్ `టైగర్ జిందా హై` చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అలాగే జాక్వెలీన్ నటించిన `ఎ జెంటిల్‌మెన్` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.