: రాజీనామా చేస్తానంటూ మోదీకి తెలిపిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు!


వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాల పట్ల రైల్వే మంత్రి సురేష్ ప్రభు కలత చెందారు. ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాజీనామా చేయాలనుకుంటున్నానని ఈ సందర్భంగా ప్రధానికి ఆయన తెలిపారు. అయితే, అలాంటి నిర్ణయం తీసుకోవద్దని, వేచి చూడాలని ఆయనకు మోదీ సూచించారు. అనంతరం సురేష్ ప్రభు మీడియాతో మాట్లాడుతూ రైలు ప్రమాదాలు ఎంతో దురదృష్టకరమని, తనకు ఎంతో బాధను కలిగించాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు రైలు ప్రమాదాలు సంభవించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News