: ఎన్నికల సంఘం ఆదేశించింది కదా.. జగన్ పై వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయండి: యనమల
ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలంటూ నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టిన సంగతి తెలిసిందే. వెంటనే జగన్ పై కేసు నమోదు చేయాలని అధికారులను సీఈసీ ఆదేశించింది.
ఈ నేపథ్యంలో, జగన్ పై వెంటనే హత్యాయత్నం కేసును నమోదు చేయాలని మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. జగన్ లో ఉన్న క్రూరత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కూడా అర్థం చేసుకుందని... ఈ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని విన్నవించారు. ఇలాంటి క్రూరమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిని ఎన్నికల పరిధి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.