rajamoli: రాజమౌళి ఇబ్బంది పడుతున్నాడట!
టాలీవుడ్ లో అపజయమెరుగని దర్శకుడిగా రాజమౌళికి మంచి పేరుంది. 'బాహుబలి' సినిమాతో ఆయన పేరు ప్రతిష్ఠలు దశ దిశలా వ్యాపించాయి. దాంతో కొత్తగా సినిమాను ప్రారంభిస్తున్నా, ఆడియో ఫంక్షన్ జరుపుతున్నా, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలన్నా ముఖ్య అతిథిగా ఆయనను ఆహ్వానిస్తున్నారు. అంతా తనకి తెలిసినవాళ్లు, కావలసిన వాళ్లు కావడంతో రాజమౌళి ఆ వేడుకలకు హాజరవుతూ వస్తున్నాడు.
ఆయన ఖాళీగా వుంటే ఫరవాలేదు. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నాడట. అందువలన ఆయా వేడుకలకు సమయం కేటాయించడానికి ఆయన కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగా వినికిడి. సినిమా ఫంక్షన్లకి ఎక్కువగా వెళ్లవలసి వస్తుండటంతో... ప్రాజెక్ట్ వర్క్ విషయంలో ఆలస్యం జరుగుతోందట. అందువలన మరీ ముఖ్యులైతేనే తప్ప, ఎవరినీ కలిసే పని పెట్టుకోకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పూర్తి దృష్టి పెట్టడం కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.