: మేడమ్ అబద్ధం చెబుతోంది.. భావనను లైంగికంగా వేధించమని తను ఆర్డర్ వేసింది, డబ్బులిచ్చింది: పల్సర్ సునీ


ప్రముఖ మలయాళ నటి భావనపై కారులో జరిగిన లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే స్టార్ హీరో దిలీప్ అరెస్టై, బెయిల్ లభించిక ఇబ్బందులు పడుతుండగా, అతని రెండో భార్య, సినీ నటి కావ్యామాధవన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ పోలీసు విచారణలో తాజాగా మరికొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. 'మేడం' ఆదేశాల మేరకే భావనను కారులో లైంగికంగా వేధించి, బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు ఫొటోలు, వీడియోలు తీశానని తెలిపాడు. ఈ ఆదేశాలు ఇచ్చి, డబ్బులు సమకూర్చిన 'మేడం' సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనని స్పష్టం చేశాడు. అయితే ఆమె ఆదేశాలు ఇవ్వడం, డబ్బు సమకూర్చడం మనహా మరేదీ చేయలేదని అన్నాడు.

అయితే ఆమె పేరు, వివరాలు మాత్రం చెప్పేందుకు మాత్రం పల్సర్ సునీ నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో ఆ 'మేడం' దిలీప్ రెండో భార్య కావ్యా మధవన్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. దిలీప్, కావ్యామాధవన్ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో భావన వారిద్దరి లక్ష్యమైందని మాలీవుడ్ లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పల్సర్ సునీ ఎవరో తనకు తెలియదని కావ్యా మాధవన్ చెబుతుండడంపై అతను మండిపడ్డాడు. కావ్యకు తానెవరో తెలియదనడం మూర్ఖత్వమని, ఆమెకు తాను బాగా తెలుసని స్పష్టం చేశాడు. ఆమె అబద్ధమాడుతోందని పల్సర్‌ సునీ తెలిపాడు.

  • Loading...

More Telugu News