: రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్ ప్రియమణి!
తాము విభిన్న మతాలకు చెందిన వాళ్లమని, అందుకే సంప్రదాయబద్ధంగా కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నామని సినీనటి ప్రియమణి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే ఈ రోజు ఆమె తన బాయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్ ను రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చినట్లు సమాచారం. వీరి రిసెప్షన్ మాత్రం రేపు సాయంత్రం బెంగళూరులో ఘనంగానే జరగనుంది.
ఓ డ్యాన్స్ షోలో కలుసుకున్న ముస్తఫా రాజ్, ప్రియమణిల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఈ రోజు పెళ్లి బంధంతో ఈ జంట ఒక్కటైంది. పెళ్లి చేసుకున్న రెండు రోజులకే షూటింగ్కు వెళతానని కూడా ప్రియమణి ఇటీవలే చెప్పింది. ప్రస్తుతం ఆమె మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది.