: పట్టపగలు, అందరూ చూస్తుండగా కిడ్నాప్.. నోరు తెరవని జనం.. వీడియో చూడండి


పట్టపగలు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కిడ్నాప్ జరిగినా ఎవరూ నోరెత్తకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన చిరువ్యాపారి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు వ్యాపార పనుల నిమిత్తం వెళ్లారు. అక్కడ ఉదయం ఒక షాపు ముందుకు వచ్చిన ఆయనను ఒక కారులో వచ్చిన నలుగురు దుండగులు బలవంతంగా కారులోకి లాక్కుపోయారు.

ఈ తతంగం జరుగుతున్నప్పుడు అక్కడే కొంత మంది నిల్చున్నా వారిని కనీసం ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు. దీంతో కిడ్నాపర్లు ధైర్యంగా అతనిని కారులోకి లాక్కెళ్లి, వెళ్లిపోయారు. ఒక షాపు ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ తతంగం మొత్తం రికార్డు కావడంతో దానిని ఆ షాపు యజమాని సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. దీనిని చూసిన ఉదయ్ పూర్ మీడియా లోకల్ ఛానెళ్లలో ప్రసారం చేయడంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి. 

  • Loading...

More Telugu News