: సాధారణ వ్యక్తిలా గాంధీ ఆసుపత్రిలోని ఓపీ విభాగానికి వెళ్లి.. వైద్యం చేయించుకున్న గవర్నర్ నరసింహన్!
గవర్నర్ నరసింహన్ ఈ రోజు ఓ సామాన్యుడిలా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలోని ఓపీ విభాగానికి వెళ్లి, వైద్యం చేయించుకున్నారు. కొన్ని రోజుల క్రితం నరసింహన్ కాలుకి గాయం అయింది. ఆ విషయాన్ని గవర్నర్ వైద్యులకు తెలిపారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు.. స్వల్ప శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. తాను ఏదైనా వైద్యం చేయించుకోవాలనుకుంటే గాంధీ ఆసుపత్రికి వస్తానని నరసింహన్ గతంలో వ్యాఖ్యానించారు. గాంధీ ఆసుపత్రికి ఆయన వచ్చిన నేపథ్యంలో సదరు ఆసుపత్రి వైద్యులందరూ గవర్నర్‌తో ముచ్చటించారు.