: 'నాకు మనుషుల్ని తినడం బోర్ కొట్టేసింది' అంటూ పోలీసుల టేబుల్ మీద కాలు, చెయ్యి పెట్టాడు!


సౌతాఫ్రికాలో కానిబాల్స్ (నరమాంస భక్షకులు) ఉంటారని సినిమాలు, కథలు చెబుతుంటాయి. అందులో వాస్తవమెంతో తెలియకపోయినా దక్షిణాఫ్రికాలో చోటుచేసుకున్న ఘటన మాత్రం పోలీసుల గుండె జారిపోయేలా చేసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... దక్షిణాఫ్రికాలోని అమాంగ్వే ప్రాంతంలో గత కొంత కాలంగా మనుషులు కనిపించకుండా పోతున్నారని పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

 అంతకు ముందు ముగ్గురు వ్యక్తులు ఒక మహిళను చంపి, ముక్కలుగా నరికి, ఆమె అవయవాలు తినేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఒక చోట కుండలో పోగుచేసిన మానవ శరీర అవయవాలు కనిపించాయి. దీంతో వారు ఇప్పటికే షాక్ లో ఉన్నారు. అంతలో తనకు మనుషుల్ని తినడం బోర్  కొట్టేసిందని చెబుతూ ఒక వ్యక్తి లొంగిపోయాడు. అంతటితో ఆగకుండా పోలీసుల టేబుల్ మీద మనిషి కాలు, చెయ్యిపెట్టాడు. దీంతో భయపడ్డ పోలీసులు, అతనిని అదుపులోకి తీసుకుని, మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. 

  • Loading...

More Telugu News