: ప్రాణాల మీదికి తెచ్చిన అత్యుత్సాహం... ఎలుగుబంటికి ఆహారం ఇవ్వబోతే!.. వీడియో చూడండి


సరదాగా జంతువులను చూసేందుకు వెళ్లి ప్రాణాలమీదకి తెచ్చుకునే అత్యుత్సాహాన్ని కొందరు పర్యాటకులు ప్రదర్శిస్తుంటారు. అలాంటి ఘటనే చైనాలోని బీజింగ్‌ శివారులో గల బడాలింగ్‌ వైల్డ్‌ లైఫ్‌ వరల్డ్‌ పార్కులో చోటుచేసుకుంది. వైల్డ్ లైఫ్ పార్క్ లో జంతువులను చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి సఫారీలో ప్రయాణిస్తూ, ఎలుగుబంటికి ఆహారం ఇచ్చేందుకు డోర్ అద్దం కిందికి దించాడు.

ఆహారాన్ని అందిస్తున్న సమయంలో మరో రెండు ఎలుగుబంట్లు వచ్చిపడ్డాయి. దీంతో అద్దాలు పైకెత్తి కారును ముందుకు పోనిచ్చాడు. ఈ ఘటనలో అతనికి చిన్నపాటి గాయాలయ్యాయి. దీనిని ఇతర కార్లలోని ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా, అది వైరల్ అయింది. కాగా, గతేడాది ఇదే పార్క్ లో తలుపులు తెరిచి రోడ్డు మీద నిల్చున్న యువతిని పులి లాక్కుపోగా, ఆమెను రక్షించేందుకు వెళ్లిన మహిళ కూడా మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో చూడండి. 

  • Loading...

More Telugu News