: చంద్రబాబును చంపాలన్నందుకు.. జగన్ పై కేసు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీసీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబును కాల్చి చంపాలంటూ, ఉరి తీయాలంటూ జగన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రిపై జగన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. వెంటనే జగన్ పై కేసు నమోదు చేయాలంటూ అధికారులను ఆదేశించింది. ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చినా తప్పులేదన్న జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య దేశంలో అభ్యంతరకరమని తెలిపింది. జగన్ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని... తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.