: పొలిటికల్ జంక్షన్లో వరంగల్ దంపతులు!


కొండా సురేఖ, కొండా మురళి.. వరంగల్ జిల్లా రాజకీయాలను, ఈ దంపతులను విడివిడిగా చూడలేం. అంతగా మమేకమయ్యారు. ఒకప్పుడు వారిద్దరూ వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులని పేరుపడ్డారు.. ఆయన మరణానంతరం స్వంత పార్టీ కాంగ్రెస్ ను వీడి వైఎస్ జగన్ పక్షాన చేరారు. జగన్ జైలుకెళ్ళడంతో, కొంతకాలం వైఎస్ విజయమ్మను అంటిపెట్టుకుని ఉన్నారు. సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలిలో నిలుచుని ఉన్నారు. ఏ పార్టీలోకెళ్ళాలో దిక్కుతోచక నలుదిశలా పరికిస్తున్నారు!

ప్రస్తుతం వైఎస్సార్సీపీకి దాదాపు దూరమైనట్టే. పార్టీలో తమను పట్టించుకోవడంలేదన్నది వీరి ప్రధాన ఆరోపణ. ఇక ఎన్నికల వేళ సమీపిస్తుండడంతో ఏదో ఒక శిబిరం వెతుక్కోవాల్సిన పరిస్థితి. టీఆర్ఎస్ లోగానీ, బీజేపీలోగానీ చేరేందుకు పావులు కదుపుతున్నారన్న వార్తలు వస్తోన్న నేపథ్యంలో వీరిని తిరిగి వైఎస్పార్పీపీలోకి లాగేందుకు జగన్.. తన బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని రంగంలోకి దింపినట్టు సమాచారం. ఇవేమీ కాకుండా, సొంతగూడు కాంగ్రెస్ లోకి వెళ్ళాలని కూడా కొండా దంపతులు భావిస్తున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News