: ఎంతకు దిగజారాడు!... డ్రగ్స్ వ్యసనం కోసం సొంత చెల్లెళ్లను తార్చాడు...!


డబ్బు కోసం అట్టడుగుకు పతనమైన వ్యక్తి అరెస్టైన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే ఆగ్రాలోని ఓ ట్యూషన్ సెంటర్ కు నగల వ్యాపారి కుమారుడు వస్తున్నాడు. అతని పూర్తి వివరాలు తెలుసుకున్న ట్యూటర్ డబ్బు కోసం తన చెల్లెళ్ల వద్దకు పంపాడు. వారు ఏకాంతంగా ఉన్న వీడియోను బయటపెడతానని చెబుతూ ఆ విద్యార్థిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.

మద్యం, నగదు, నగలు, ఖరీదైన మొబైల్ ఫోన్లు ఇవ్వాలంటూ గొంతెమ్మ కోరికలు కోరడం ప్రారంభించాడు. దీంతో బాధితుడు తన పరిస్థితిని తన అమ్మమ్మకు వివరించాడు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ట్యూటర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. విద్యార్థి దగ్గర నుంచి తీసుకున్న డబ్బుతో డ్రగ్స్, కారు, ఫ్రిజ్, ఏసీ, సోఫాలు కొనుగోలు చేసినట్టు అంగీకరించాడు. దీంతో ఆ వస్తువులను స్వాధీనం చేసుకుని, అతనిని అరెస్టు చేశారు. అతని చెల్లెళ్లు పరారీలో ఉన్నారు. వారిపై ఐపీసీ సెక్షన్ 384 కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. 

  • Loading...

More Telugu News