: మామతో పాటు వచ్చి ఓటు వేసిన శిల్పా మోహన్ రెడ్డి కోడలు
నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ తరపున బరిలోకి దిగిన శిల్పా మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సంజీవ్ నగర్ లోని బూత్ నంబర్ 81లో ఆయన ఓటు వేశారు. ఆయనతో పాటు ఆయన కొడుకు, కోడలు, తదితర కుటుంబసభ్యులంతా బూత్ కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, భారీగా బలగాలు మోహరించి ఉన్నాయి.