: ముస్లిం సంప్రదాయంలో విడాకులు నాలుగు రకాలు... అవేంటంటే!
ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు తీర్పు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో అసలు ముస్లిం సంప్రదాయంలో విడాకులు ఎన్ని రకాలుగా తీసుకోవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. ఇందులో ముస్లిం సంప్రదాయంలో నాలుగు రకాల విడాకుల విధానం అమలులో ఉండగా, ఎక్కువ మంది పురుషులు తమకు ఇష్టమైన, అనువైన ట్రిపుల్ తలాక్ వైపు మొగ్గు చూపుతుండడం విశేషం. వాటి వివరాల్లోకి వెళ్తే...
1) ట్రిపుల్ తలాక్: భార్యకు విడాకులివ్వాలనుకున్న భర్త భార్యతో తలాక్ అంటూ మూడు సార్లు చెప్పడం. ఇదే ఎక్కువ వినియోగంలో ఉంది.
2) ఖులా: ఇది భార్యాభర్తలిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు అనుసరించే విధానం. ఈ విధానంలో ఇద్దరూ ఒక అంగీకారానికి రావాల్సి ఉంటుంది.
3) ఫస్ఖ్ ఈ నిఖా: వివాహాన్ని రద్దు చేసుకునే కార్యక్రమం. భార్యతో వివాహాన్ని పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించే కార్యక్రమం.
4) తఫ్వీద్ అల్ తలాక్: ఈ విధానంలో భర్త తనకు వద్దని, భర్త నుంచి విడిపోతున్నానంటూ భార్య స్వయంగా కోరుకునే విడాకులు విధానం. ఈ నాలుగు విడాకుల విధానాలు ముస్లిం సంప్రదాయంలో ఉన్నాయి.