: మీరు పెట్రోలు పోయించుకున్న ప్రతిసారీ మీ నుంచి ప్రభుత్వం ఈ ఫండ్‌ను వసూలు చేస్తోంది.. మీకు తెలుసా?


మీకీ విషయం తెలుసా? మీ వాహనంలో డీజిల్, పెట్రోలు పోయించుకున్న ప్రతిసారి మీరు కొంత మొత్తాన్ని టాయిలెట్ నిర్వహణ కోసం ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. డీజిల్ పోయించుకున్న వారి నుంచి ఆరు పైసలు, పెట్రోలు కొట్టించుకున్న వారి నుంచి నాలుగు పైసలు చొప్పున ప్రభుత్వం వసూలు చేసి నిధికి  జమచేస్తోంది. టాయిలెట్ నిర్వహణ కోసమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు పెట్రోలియం మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. టాయిలెట్ల నిర్వహణ కోసం నెలవారీ చేస్తున్న ఖర్చు సరిపోకపోవడంతో ఇలా వాహనాదారుల నుంచి  కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నట్టు వివరించారు.

పెట్రోలు పంపుల్లో టాయిలెట్లు, తాగునీరు ఏర్పాటు చేయడం తప్పనిసరి అని, దీనిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛ భారత్ యాప్ ఉపయోగించి ఆయా ప్రాంతాల్లోని వారు వినియోగించే టాయిలెట్ల నిర్వహణ పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని కోరారు. ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సాల్ ప్రకారం సగటున రోజుకు 1.7 లక్షల లీటర్ల పెట్రోలు, డీజిల్ విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఫలితంగా టాయిలెట్ల నిర్వహణ కోసం రూ.9 వేలు సమకూరుతున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News