: నంద్యాల ఉపఎన్నికల ఓటింగ్ షురూ... ఓట్లేసేందుకు బారులు తీరుతున్న ప్రజలు


నంద్యాల ఉపఎన్నికల్లో ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ లో మొత్తం 2,19,108 మంది ఓటర్లు పాల్గొననున్నారు. వీరందరి కోసం మొత్తం 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 800 మంది నుంచి 1000 మంది ఓటేసేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 3500 మంది పోలీసులు ఎన్నికల రక్షణ బాధ్యతలు తీసుకోగా, అందులో పది కంపెనీలకు చెందిన 2,500 మంది కేంద్ర సిబ్బంది ఉండడం విశేషం. గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రతా సిబ్బందికి బాడీ ఓర్న్ కెమెరాలు, ఈవీఎంలకు వీసాపాట్ సౌకర్యాన్ని ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఎన్నికలు సాఫీగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. 

  • Loading...

More Telugu News