: జగన్ ఎంత తిట్టినా నేను సంయమనం కోల్పోను: సీఎం చంద్రబాబు


వైసీపీ అధినేత జగన్ తనను  తిట్టి అందరి దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నారని, ఆయన ఎంత తిట్టినా తాను సంయమనం కోల్పోనని ఏపీ సీఎం చంద్రబాబునాయడు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం అనేది ఒక వ్యవస్థ అని, ఆ వ్యవస్థకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. గతంలో జగన్, గాలి జనార్దన్ రెడ్డి ఐకాన్స్ గా చెలామణి అయ్యారని, ప్రస్తుతం వారి చరిత్ర ఏంటో అందరికీ తెలుసని చంద్రబాబు అన్నారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం రాకుండా ఉంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్లమని అన్నారు. ఎగువ రాష్ట్రాల వాళ్లు తమకు వరదలు వచ్చినప్పుడు మనకు నీటిని వదలడం, మిగతా సమయాల్లో కనీసం తాగునీటిని కూడా వదలకపోవడం దారుణమని మండిపడ్డారు. న్యాయంగా రావాల్సిన నీటి వాటా కోసం అవసరమైతే కోర్టుకు వెళతామని అన్నారు. తన పేషీలో ఫైళ్లు పెండింగ్ ఉండొద్దని సీఎంవోకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News