: కప్పు కాఫీ తాగి.. నిద్రలేమికి దూరంగా ఉండండంటున్న పరిశోధకులు!
ప్రతి రోజు మోతాదుకి మించకుండా కాఫీ తాగితే మంచిదేనని ఇప్పటికే ఎన్నో పరిశోధనల్లో నిరూపితమైన విషయం తెలిసిందే. తాజాగా మరో విషయం బయటపడింది. కాఫీ తాగితే నిద్ర పట్టబోదని మనం అనుకుంటాం. అందులోని కెఫిన్ అనారోగ్య సమస్యలు కూడా తీసుకొస్తుందని కొందరు భ్రమపడుతుంటారు. కానీ, కాఫీ తాగితే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని మిచిగాన్‌లోని అనస్తీషియాలజీ విభాగ పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. నిద్రలేమి తనం పోగొట్టడానికి, శస్త్రచికిత్స అనంతరం ఏర్పడే నొప్పి తగ్గించడానికి ఓ కప్పు కాఫీ మందులా పనిచేస్తుందని చెబుతున్నారు. కాఫీలోని కెఫిన్ మనిషిలో చురుకుదనాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. అంతేకాదు మనిషి సుదీర్ఘకాలం పాటు జీవించేందుకు, హృద్రోగ సమస్యలు, కేన్సర్ బారిన పడకుండా ఉండేందుకు కూడా కాఫీ ఉపయోగపడుతుందని చెప్పారు.