: అమ్మకు సురక్షితంగా కాన్పు చేసి.. తమ్ముడిని బతికించుకున్న పదేళ్ల బాలుడు!


ఓ ప‌దేళ్ల‌ బాలుడు త‌న‌ త‌ల్లికి సుర‌క్షితంగా కాన్పు చేసిన ఘ‌ట‌న ఢిల్లీలో చోటు చేసుకుంది. అష్లే మోరీ (36), కెల్సీ రీచర్డ్ అనే దంపతులు ఉద్యోగ రీత్యా ఆ న‌గ‌రంలో ఉంటున్నారు. అష్లే మోరీ ఆఫీసుకి వెళ్ల‌గా, గ‌ర్భ‌వ‌తి అయిన‌ కెల్సీ రీచ‌ర్డ్ ఇంట్లో త‌న ప‌నులు చేసుకుంటోంది. కడుపులో కొంచెం నొప్పి రావ‌డంతో అష్లే బాత్‌రూంకు వెళ్లింది. అయితే, నొప్పులు తీవ్రం అయి బాత్రూంలోనే పడిపోయింది. ఇంట్లో ప‌దేళ్ల‌ కుమారుడు ఫాంటెనాట్‌ త‌ప్ప ఎవ్వ‌రూ లేరు. ఆ బాలుడు ఆసుపత్రికి ఫోన్ చేశాడు. అయితే, ఆసుప‌త్రి సిబ్బంది వ‌చ్చేసరికి ఆల‌స్యం అవుతుంద‌ని తెలుసుకున్నాడు.

దీంతో ఆ బాలుడు ఏం చేయాలో తనకు చెప్పాలని త‌ల్లిని అడిగాడు. ఆమె వివరిస్తుంటే జేడెనే కాన్పు చేశాడు. ఆ బాలుడికి ఓ త‌మ్ముడు పుట్టాడు. అయితే, ఆ శిశువు శ్వాస తీసుకోవ‌డం లేదు. దీంతో ఆ బాలుడు వంటగదిలోని నాజిల్‌ ద్వారా కృత్రిమ శ్వాసను అందించాడు. ఇంత‌లో ఆసుపత్రి నుంచి సిబ్బంది వ‌చ్చారు. ఆ బాలుడు శిశువుకి శ్వాసను అందించకపోయి ఉంటే ఆ శిశువు మృతి చెందేద‌ని వైద్యులు చెప్పారు. 

  • Loading...

More Telugu News