: తెలంగాణలో డ్రగ్స్ అరికట్టడంపై చర్చించిన అధికారులు
ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ రోజు సమావేశమయ్యారు. తెలంగాణలో డ్రగ్స్ అరికట్టే అంశంపై వారు చర్చించారు. డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టయిన కెల్విన్, మైక్ కెమింగా సమాచారం మేరకు డ్రగ్స్ ముఠాలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. డ్రగ్స్ మాఫియా డేటాను నార్కోటిక్స్ బృందం సేకరించింది. ఈ డేటా సాయంతో విదేశాల నుంచి డ్రగ్స్ రవాణా అరికట్టడం, డార్క్ నెట్ వంటి ఆన్ లైన్ డ్రగ్స్ సంస్థల కట్టడిపై సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం.