: భన్వర్‌లాల్‌ను కలిసి ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ న్యూస్ ఛానల్‌పై ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌ సీపీ నేతలు


నంద్యాల‌లో ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీ తీరును త‌ప్పుబ‌డుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఈ రోజు ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర‌ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి భ‌న్వ‌ర్ లాల్‌ను క‌లిసి ఫిర్యాదు చేశారు. అలాగే ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ న్యూస్ ఛాన‌ల్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి వార్త‌లు ప్రసారం చేసింద‌ని కూడా వారు ఫిర్యాదు చేశారు. ఎన్నిక‌ల సంఘం ఆదేశాలను పట్టించుకోకుండా ఆ ఛానెల్‌ సర్వే వివరాలు ప్రసారం చేసింద‌ని వారు ఆరోపించారు.
 
నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చార‌ గడువు ముగిసినప్ప‌టికీ టీడీపీ నేత‌లు ఆ ప్రాంతంలోనే ఉన్నారని వైసీపీ నేతలు అన్నారు. స్థానికేతర నేతలను వెంట‌నే అక్కడి నుంచి పంపించాలని కోరారు. టీడీపీ నేత‌లు ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నార‌ని అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి భ‌న్వ‌ర్ లాల్‌ను క‌లిసిన వారిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, కె.శివకుమార్‌, చల్లా మధుసూదన్‌ రెడ్డి, ఇత‌ర వైసీపీ నేత‌లు ఉన్నారు. 

  • Loading...

More Telugu News