: ట్రిపుల్ తలాక్ కు ఒవైసీ మద్దతు పలకడం విడ్డూరం: బీజేపీ నేత లక్ష్మణ్


ఇస్లాం దేశాల్లో కూడా అమలులో లేని ట్రిపుల్ తలాక్ కు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మద్దతు పలకడం చాలా విడ్డూరంగా ఉందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ విమర్శించారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పౌరహక్కులను కాపాడేలా ఉందని, అందరూ అంగీకరించాలని అన్నారు. ఈ తీర్పు ముస్లిం మహిళల ఆత్మగౌరవం, స్వావలంబనకు సంబంధించిందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఇప్పటికైనా పేద ముస్లిం మహిళలకు అన్ని పార్టీలు అండగా ఉండాలని, ఈ తీర్పును ప్రచారం చేయాలని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News