: భారత్‌లోకి మేం ప్రవేశిస్తాం.. అప్పుడు చేయడానికి ఇంకేమీ మిగలదు: భారత్‌కు చైనా హెచ్చరిక
భారత్, చైనాల మధ్య నెలకొన్న డోక్లాం సమస్యపై చైనా మరోసారి బెదిరింపు ధోరణితో వ్యాఖ్యలు చేసింది. తమ వాదనలను భారత్ లెక్కచేయడం లేదని వాపోయింది. భారత్ తన తీరును మార్చుకోకపోతే తాము ఇండియాలోకి ప్రవేశించాల్సివుంటుందని, అప్పుడు ఇక ఏం మిగలబోదని హెచ్చరించింది. డోక్లాంలో తమ సైన్యాన్ని అడ్డుకున్నందుకు భారత్ చెబుతున్న కారణాలు సరిగాలేవని వ్యాఖ్యానించింది. డోక్లాంలో చైనా వేస్తోన్న రహదారి నిర్మాణాన్ని అడ్డుకున్నందుకు గానూ భారత్ పై చైనా విషం చిమ్ముతోంది. ఆ భూభాగం తమదేనని చైనా వాదిస్తోంది. ఆ భూభాగం చైనాది కాదని భూటాన్ కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.