: మాల్దీవులు పార్లమెంటులో మోహరించిన సైన్యం.. విపక్ష ఎంపీలపై దాడి!


మాల్దీవులు పార్లమెంటులో విపక్షాలకు చెందిన ఎంపీలపై ఆ దేశ సైన్యం దారుణంగా వ్యవహరించింది. పార్లమెంటు స్పీకర్ పై అభిశంసన తీర్మానం నేపథ్యంలో సాధారణ దుస్తుల్లో ఉన్న సైనికులు పార్లమెంటును తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విపక్ష ఎంపీలపై వారు దాడి చేశారు. అంతేకాదు, పార్లమెంటులో స్పీకర్ చుట్టూ కూడా సైనికులే రక్షణగా నిలిచారు. అభిశంసన తీర్మానాన్ని నిర్వీర్యం చేసే క్రమంలోనే అధికారపక్షం సైన్యాన్ని వాడుకుందని విపక్ష ఎంపీలు మండిపడుతున్నారు. అధ్యక్షుడు యామీన్ చట్ట విరుద్ధంగా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


  • Loading...

More Telugu News